పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత కూడా పవన్ నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు.
అయితే ఇప్పుడు పవన్ మరో మార్గం లో స్పీడ్ చూపించడానికి సిద్ధం అవుతున్నారు. పవన్ క్రియేటివ్ వర్క్స్ పేరిట సొంత బ్యానర్ లో ఓ సినిమాను పవన్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాకు డాలి దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం ఇదే విషయం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.