పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు సినిమాలను చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, రైటర్ గా, సింగర్ గా ఇప్పటివరకు కనిపించారు. ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సారి సింగర్ గా మారబోతున్నారట.
పవన్ , రానా హీరోలుగా తెరకెక్కబోతున్న అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్ లో ఈ పాట ను పాడించబోతున్నారట. ఇదివరకు దేవిప్రసాద్ సంగీత దర్శకత్వంలో పవన్ గళం విప్పారు. అయితే ఇప్పుడు తమన్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారట. మరి పవన్ దీనికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.