ట్విట్టర్ వేదికగా జగన్ పై రోజుకో విమర్శ చేస్తూనే ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆరు నెలల పాలన ఆరు ముక్కల్లో చెప్పొచ్చు అంటూ గతంలో విమర్శించిన పవన్ ఇప్పుడు మరో సారి విమర్శనాస్త్రాలు ప్రయోగించారు. 1996 పౌర హక్కుల సంఘం ప్రచురించిన కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యం అనే పుస్తకాన్ని ప్రస్తావించారు.
రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నా ఎందుకు దళిత వర్గాలు, వెనుకబడిన తరగతుల వారు సహా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది.’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతే కాదు… ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుందని పవన్ మరో ట్వీట్ చేశారు.