ప్రస్తుతం హరిహరవీరమల్లుతో పాటు సముద్రఖని సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ నెలాఖరు నుంచి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. మార్చి 28 నుంచి ఉస్తాద్ భగత్‌సింగ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్‌కళ్యాణ్ లుక్ టెస్ట్‌కు సంబంధించిన షూట్ గురువారం జరిగింది. ఈ లుక్ టెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో దర్శకుడు హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ కనిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ నెల 28 నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుపబోతున్నట్లు సమాచారం.
తమిళంలో విజయవంతమైన తేరి రీమేక్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ రీమేక్ వార్తలపై దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు, సముద్రఖని సినిమాలతో పాటు సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ సినిమా చేయబోతున్నాడు.