పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, పవన్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతి కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
జనవరి 14, 6:03 నిమిషాలకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ టీజర్ లో ఉన్న ఓ డైలాగ్ లీక్ అయింది. మెట్రో రైల్ ఫైటింగ్ సీన్ ఒకటి ఈ టీజర్ లో ఉంటుందట.అప్పుడు పవన్ కళ్యాణ్ కోర్టులో కోటు వేసుకునివాదించగలను..బయట కోటు తీసి వాయించగలను అంటూ డైలాగ్ చెప్తాడట. ప్రస్తుతం ఇదే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ నోట ఆ డైలాగు వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.