వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్ పవన్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
కాగా వకీల్ సాబ్ టీజర్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జనవరి 14 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది వకీల్ సాబ్ టీమ్.
Get ready for the Most Awaited Powerstar @PawanKalyan’s #VakeelSaabTEASER on Jan 14th at 6:03PM🔥
Subscribe & Stay Tuned to https://t.co/lHCRua8Enh#SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @BayViewProjOffl @BoneyKapoor @MusicThaman pic.twitter.com/wQzIQFSGjq
— Boney Kapoor (@BoneyKapoor) January 7, 2021