పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేసింది. ఆయన హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న వకీల్‌సాబ్ టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. ‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ పవన్ చెప్పిన డైలాగ్‌ను రిప్లే చేస్తూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ మూవీని .. వకీల్‌సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరమైన పవన్.. రాజకీయాలతో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తుండటంతో వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికాగా.. త్వరలోనే వకీల్‌సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.