రాయలసీమ పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు తిరులమ శ్రీవారి దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేసిన పవన్, ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
కొన్ని దశాబ్దాల క్రితం స్వామి వారి సన్నిధిలోనే అక్షరాబ్యాసం చేశానని గుర్తు చేసుకున్నారు. ధర్మోరక్షతి రక్షతః అనే పాఠాన్ని స్వామి వారి సన్నిధిలోనే నేర్చుకున్నానన్నారు. ఈ విషయంలో త్రికరణశుద్దిగా ముందుకెళ్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వెడుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఇటు కార్యకర్తలు అటు అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు.