సాగర కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో గా దగ్గుబాటి రానా నటిస్తున్నారు. నిత్యమీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది.
ఫిబ్రవరి 25 కానీ,ఏప్రిల్ 1న కానీ ఈ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫైనల్ అవుట్ పుట్ ను ప్రసాద్ ల్యాబ్ లో బుధవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ తో కలిసి చూశారట.
అవుట్ మంచిగా రావడంతో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు కూడా తెలిపారట. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తోపాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.