ఓ వైపు రాజకీయాలు,మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కుటుంబంతో సమ్మర్ వెకేషన్ కి వెళ్లారు.రాజకీయాలు వేడందుకుంటున్న సమయంలో వేకేషన్ కి వెళ్లడం గమనార్హం.
అంతేకాదు సినిమా షెడ్యూల్ కూడా చాలా టైట్ గా ఉంది. తన తాజా చిత్రం ‘వినోదయ సిత్తం’ రీమేక్ షూటింగ్ పూర్తయింది.మరో వారంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దర్శకుడు సుజిత్ పవన్ తో తన సినిమా కోసం లొకేషన్స్ వేటలో ఉన్నాడు.
ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరకడంతో తన ఫ్యామిలీతో కలిసి పవన్ సమ్మర్ వెకేషన్ కు వెళ్లారు. భార్య లెజినోవా, కుమార్తె పోలేనా, చిన్న కుమారుడు మార్క్ శంకర్ లతో కలిసి రాజస్థాన్ కు వెళ్లారు. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో తన కుటుంబంతో కలిసి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#PawanKalyan garu at #Udaipur with Family 🤩❤️ pic.twitter.com/LlxvTl0weJ
— Gopal Karneedi (@gopal_karneedi) April 1, 2023