రాజకీయాలపై ఫోకస్ చేస్తూనే వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మరో మూవీకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎంతో మంది ప్రముఖ దర్శకులు పవన్ తో సినిమా కోసం వెయిట్ చేస్తుండగా, పవన్ ఈసారి ఓ కొరియోగ్రాఫర్ కు అవకాశం ఇచ్చినట్లు ఇండస్ట్రీ కోడై కూస్తుంది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎప్పటి నుంచో పవన్‌ని డైరెక్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే పవన్ ను కలిసిన జానీ మాస్టర్ ఓ కథను పవన్ కు వినిపించగా పవన్ సినిమాకు వెంటనే అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కనుంది.
ఈ మూవీకి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. పవన్-జానీ మాస్టర్ సినిమాకు నిర్మాతగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ వ్యవహరించనున్నారు. పవన్ సినిమాకు ఓకే చెప్పటంతో జానీ మాస్టర్ రాంచరణ్ కు కథ వినిపించారని, ఆయన కూడా సినిమాను నిర్మించేందుకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.