పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరం అయిన పవన్, ఇప్పుడు హింది సినిమా పింక్ రీమేక్ ద్వారా రీ ఏంట్రీ ఇవ్వబోతున్నారు.
పింక్ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ సినిమా చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పారు. ఔరంగజేబు కాలం నాటి ఓ కథలో పవన్ ఓ బందిపోటు పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే, ఈ సినిమాలో పవన్ డబుల్ యాక్షన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ను కొత్తగా చూపించాలని క్రిష్ పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏఎం రత్నం తెరకెక్కిస్తుండగా… విరుపాక్షి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.