కాంగ్రెస్ ప్లీనరి సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం నుంచి దించి మరీ ఆయన్ని అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
చత్తీస్ గఢ్ రాజధానిలో రాయ్ పూర్ లో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి బయలు దేరారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆయన్ని అడ్డుకున్నారు. విమానం నుంచి ఆయన్ని కిందకి దించి అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేసినట్ట తెలుస్తోంది. పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. అరెస్టు వారెంట్ లేకుండానే కాంగ్రెస్ నేతను అదుపులోకి తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. బీజేపీ కావాలనే కాంగ్రెస్ నేతలపై బలప్రయోగం చేస్తోందని విమర్శించారు.
పవన్ ఖేరాను ఢిల్లీ-రాయ్‌పూర్ విమానం నుంచి దింపి, ఏఐసిసి ప్లీనరీకి రాకుండా చేయడం ద్వారా మోడీ సర్కార్ గూండాలాగా వ్యహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఖేరాను అడ్డుకోవడం సిగ్గు చేటని, పార్టీ మొత్తం పవన్ ఖేరాకు అండగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై పవన్ ఖేరా విమర్శలు చేశారు. ప్రధాని మోడీని నరేంద్ర గౌతమ్ దాస్ మోడీ అంటూ ఖేరా ఎద్దేవా చేశారు. దీంతో ఆయన్ని అరెస్టు చేయాంలంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖేరాను అదుపులోకి తీసుకున్నారు.