ఓ వైపు రాజకీయ కార్యకలాపాలను చూసుకుంటూనే మరోవైపు పవన్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పింక్ రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొంటుండగానే ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక,నిర్మాతలు క్యూ కట్టారు. కాగా పింక్ రీమేక్ తోపాటు, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కూడా పవన్ రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగానే హరీష్ శంకర్ తో కూడా జత కట్టేందుకు పవర్ స్టార్ ఒకే చెప్పారు. ఓవైపు పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటూనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ పవన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబందించి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ షురూ అయింది. తొలిరోజు షూటింగ్ కు పవన్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రం కోసం పవర్ స్టార్ 15రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించనున్నట్లు సమాచారం. మరో కీలక పాత్రలో అనసూయ నటించనుంది.
ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. స్వతంత్ర ఉద్యమానికి ముందు జరిగిన కొన్నింటిని ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ప్రధానంగా బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని స్పూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.