ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “భీమ్లా నాయక్” ఎట్టకేలకు శుక్రవారం ఉదయం థియేటర్లలోకి వచ్చింది. ఇక పవర్‌స్టార్ అభిమానుల నుండి స్పందన అత్యద్భుతంగా ఉంది. పవన్ రానా ల ఇద్దరి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నిజానికి పవన్ సినిమా అంటే పవర్‌స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. విడుదల ఉదయం కటౌట్ లు డప్పులు, నృత్యాలు, పూజలు హంగామా మాములుగా ఉండదు. అయితే ఒక మహిళా అభిమాని పవన్ కళ్యాణ్ కటౌట్ పైకి ఎక్కి పవన్ కు పాలాభిషేకం చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
మెడ లో ఎర్రటి గుడ్డను ధరించి, పాల ప్యాకెట్‌ను నోటితో చింపి, పవన్ కటౌట్‌పై పోసింది. పవన్‌కి ఆడవాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
This is called craze 🔥🔥🔥🔥…. #BheemlaNayak #BlockBusterBheemLaNayak pic.twitter.com/V5aXtbZBI0
— Knowledge Is Divine (@BhavadheeyuduPK) February 25, 2022