టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లోని బాబు ఇంట్లో ఈ భేటీ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ ఆంక్షలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే అక్రమ కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకుంటున్నారు.
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారో అనేది ఉత్కంఠగా మారింది. పొత్తుపై తెగ ప్రచారం జరుగుతుండగా.. వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 1తో ఏపీలో డైలాగ్ వార్ కొనసాగుతోంది. తాజా భేటీలో పవన్, బాబు దీనిపై చర్చిస్తున్నట్లు సమాచారం. గతంలో పవన్ విశాఖ పర్యటనపై ఆంక్షలు విధించిన సమయంలో చంద్రబాబు ఆయన్ను కలిశారు.