సుదీర్ఘ విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వరుస సినిమాలకు ఓకే చెప్తున్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో పాటు, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ సినిమా విడుదల వాయిదా పడింది. లేకుంటే పవర్ స్టార్ అభిమానుల సందడి ఇప్పటికే మొదలయ్యేది. ఇకపోతే హరీష్ శంకర్ తో పవన్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథని తెలుస్తోంది.
దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా అనే సినిమా కంటే ముందే ఒక కథను చెప్పగా దాన్ని రిజెక్ట్ చేశాడట ఎన్టీఆర్. ఇక ఇప్పుడు కొద్దిపాటి మార్పులతో పవన్ కళ్యాణ్ కి వినిపించగా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలా సందర్భాల్లో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలు మరొక హీరో చేసి హిట్టు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పవన్ హిట్ కొడతాడా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.