డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా పూరి పవన్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పూరీ జగన్నాథ్ పవన్ కుఓ లైన్ చెప్పాడట. ఆ లైన్ పవన్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
అయితే ఆ స్క్రిప్ట్ గతంలో మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడట. జనగణమన అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో న్యాయ వ్యవస్థలోని డొల్లతనాన్ని, మొత్తం వ్యవస్థలో ఉన్న లోపాలు గురించి చూపించనున్నాడట. 2022 లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుందని సమాచారం. ఇక పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.