టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరంటే, ఠక్కున వినిపించే పేరు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్. ఈ హీరో తర్వాత స్థానంలో మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లు ఉన్నారు.
అయితే ఇప్పుడీ ఆర్డర్ కాస్త మారినట్టు కనిపిస్తోంది. ప్రభాస్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా పవన్ కల్యాణ్ అవతరించాడు. తన అప్ కమింగ్ సినిమా కోసం ఈ హీరో ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఆ సినిమా పేరు ఓజీ.
డీవీవీ దానయ్య బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు పవన్ కల్యాణ్. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియని ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఏకంగా 75 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇవి కాకుండా, లాభాల్లో వాటా కూడా కొంత వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే, పవన్ పారితోషికం 75 కోట్లకు మించిపోయిందన్నమాట.