పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో సుజీత్ డైరెక్షన్ లో రాబోతున్న మూవీ కూడా ఒకటి. ‘సాహో’ తర్వాత సుజీత్ గ్యాప్ తీసుకొని పవన్ కోసం ఓ అదిరిపోయే గ్యాంగ్ స్టర్ స్టోరీ రెడీ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై దానయ్య నిర్మించబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ తో సినిమాను ఎనౌన్స్ చేసి They Call him #OG అనే క్యాప్షన్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.
ఇప్పుడీ సినిమా లాంఛ్ డేట్ వచ్చింది. ఈ నెల 30న హైదరాబాద్ లో సినిమా గ్రాండ్ గా లాంచ్ అవ్వనుంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తన బ్యానర్ లో పవన్ చేస్తున్న తొలి సినిమా కావడంతో ప్రారంభ వేడుకను భారీ ఎత్తున చేయబోతున్నాడు దానయ్య.
సుజీత్ ఇప్పటికే పవన్ సినిమాకి సంబంధించి స్క్రిప్టింగ్ కంప్లీట్ చేశాడు. లొకేషన్స్. కాస్టింగ్ ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. పవన్ కి వీరాభిమాని అయిన సుజీత్, పవర్ స్టార్ ను గ్యాంగ్ స్టర్ గా ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరం.