పెద్ద హీరోలెవరికీ టార్గెట్లు ఉండవు. నచ్చితే సినిమా చేస్తారు లేదంటే చేయరు. చేయాలనుకుంటే ఏడాదికి 2 సినిమాలు చేస్తారు, లేదంటే ఒక సినిమాతోనే సరిపెడతారు. ఎన్టీఆర్ లాంటి హీరోలైతే ఏడాది మొత్తం సినిమా రిలీజ్ చేయని పొజిషన్ లో కూడా ఉన్నారు. అది వాళ్లిష్టం. అయితే పవన్ విషయంలో మాత్రం ఈ సౌలభ్యం లేదు.
పవన్ కల్యాణ్, ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు రిలీజ్ చేసి తీరాలి. లేదంటే అతడిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే, ఆయన చేతిలో ఆల్రెడీ 4 సినిమాలున్నాయి కాబట్టి.
హరిహర వీరమల్లు సినిమా ఎలాగైనా ఈ ఏడాది రిలీజ్ అవుతుంది. కిందామీద పడి ఆ సినిమాను పూర్తిచేస్తారు పవన్. దీంతో సమస్య లేదు. కానీ మిగతా నిర్మాతలు కూడా తమకు సినిమా చేయాలని పట్టుబడుతున్నారు. ఇక్కడే వచ్చింది తలనొప్పి.
ఒప్పుకున్న మిగతా సినిమాల్లో ఏదో ఒక మూవీని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నాడు. అయితే అది ఏ సినిమా అనేది ఆయన నిర్ణయించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి పీపుల్ మీడియా బ్యానర్ నుంచి పవన్ పై గట్టి ఒత్తిడి ఉంది.