జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పవన్ చాలా రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం, నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ నాయకులకు గ్యాంబ్లింగ్ అడ్డాలను నిర్వహించటంలో ఉన్న శ్రద్ధ, ప్రభుత్వాన్ని నడపటంలో లేదంటూ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసినవే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మంత్రి కొడాలి నాని ఇలాకా అయిన గుడివాడలో పవన్ చాలా రోజుల తర్వాత హాట్ హాట్ కామెంట్స్ చేయటంతో రాజకీయంగా హీట్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం రోడ్లను మెయింటెన్ చేసే శ్రద్ధ కూడా పెట్టడం లేదని, కొత్త రోడ్లను పట్టించుకోవటం లేదని పవన్ ఆరోపించారు. 175మందిలో 151 ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇంత చెత్త రోడ్లు ఇస్తారా అంటూ అని ప్రశ్నించారు.