పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీఎంట్రీ మాములుగా లేదు, ఒకవైపు వకీల్ సాబ్ సినిమాతో పాటు మరో వైపు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా పవన్ నటిస్తున్నాడు. అంతే కాకుండా హరీష్ శంకర్ కథకు కూడా పవన్ ఒకే చెప్పారని సమాచారం. ఇప్పటికే పవన్ సినిమా న్యూ లుక్ కోసం గడ్డం కూడా తీసేశాడు. గడ్డం తీసిన తరువాత జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు. ఈ సమయంలో పవన్ చెయ్యి పై ఓ ట్యాటూ కనిపించింది. ఇంతకు ముందు పవన్ చేతిపై ఆ ట్యాటూ ఎప్పుడూ కనిపించలేదు. మరి పవన్ ట్యాటూ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు. పవన్ ఫాన్స్ నెట్టింట్లో ట్యాటూ గురించి తెగ చర్చించుకుంటున్నారు.