ఇసుక కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లో నవంబర్ 3 న లాంగ్ మార్చ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల 35 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని దీనికి నిరసనగా పవన్ ఈ మార్చ్ చెయ్యనున్నారు. పవన్ చేపడుతున్న ఈ లాంగ్ మార్చ్ కి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరటం జరిగింది. బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ లు మద్దతు ప్రకటించగా టీడీపీ మాత్రం మద్దతుపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీపై తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తున్నప్పటికీ పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ పై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోటం లేదు.
పవన్ మరో సారి ఈ విషయం పై ట్వీట్ చేశారు. ఇసుక పాలసీపై తాను చేపడుతున్న లాంగ్ మార్చ్ కి అన్ని పార్టీ లు కూడా తమ మద్దతు ఇవ్వాలని కోరారు.కానీ టీడీపీ పేరు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. జనసేన అధినేత పవన్ చేపడుతున్న ఈ లాంగ్ మార్చ్ కి మరి టీడీపీ మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.