మరో సారి జగన్ సర్కార్ ను తప్పుబట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ఏర్పాటు చెయ్యాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మాతృ భాష పై ఎంతో అభిమానం ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందరి కోసం అమ్మ భాష పేరుతో ఓ ఆర్టికల్ ని రాశారు.
ఆ ఆర్టికల్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం వల్ల మాతృ భాష కనుమరుగైపోయే ప్రమాదం ఉందని, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టాడు. మాతృభాష గొప్పదనాన్ని చెప్తూ రాసిన ఆర్టికల్ వైసీపీ కి కనువిప్పులాంటిదని ట్వీట్ చేశారు. వెంకయ్యనాయుడు రాసిన ఆర్టికల్ ని ఫోటో తీసి పోస్ట్ చేశారు పవన్.