తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజు రోజుకు మండిపడుతున్నాయి. ఉల్లి రేట్లు అమాంతం పెరగటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రైతు బజారులను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు ఇబ్బందులైతే తగ్గట్లేదు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కు పంచ్ వేశారు జనసేనాని.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు, కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా అని దాని రేటు పెంచేశారు చురుకు అంటించారు. పవన్ ట్వీట్ కు మరి కొందరు రిప్లయ్ ఇస్తూ మరి కొన్ని రోజుల్లో ఉల్లికి రంగులు వేస్తారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ కామెంట్స్ పై జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఏ మేర స్పందిస్తారో చూడాలి.