నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది ఈ షో.
అయితే, ప్రజెంట్ అందరి చూపులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎపిసోడ్ పైనా ఉన్నాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి ఆహా అప్ డేట్ ఇచ్చింది. ఇక పవర్ స్టార్ అభిమానులు సైతం హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ షోను టెలికాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేశారు.
అంతేకాకుండా ప్రమోషన్స్‌లో భాగంగా హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. చరిత్రలో తొలిసారి ఒక టాక్ షోకు సంబంధించి ఇలా భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేయడం తొలిసారి. విజయవాడలో పవన్, బాలకృష్ణలతో కూడిన భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఓటీటీలో ఇప్పటి వరకు ఎవరూ క్రియేట్ చేయని రికార్డును పవన్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు.
కేవలం 5 నిమిషాల్లో హయ్యేస్ట్ యాప్ లాంచ్‌స్ ను ఆచీవ్ చేసేశారు. దీంతో ఒప్పేసుకున్నాం.. మీరు ఆయన ఫ్యాన్స్ కాదు.. భక్తులే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్‌తో జరిగిన షో సందర్భంగా ఒకేసారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున యాప్ ఓపెన్ చేయడంతో క్రాష్ అయిన విషయం తెలిసిందే.అయితే ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడానికి ఆహా నిర్వాహకులు పకడ్బందీ ప్లాన్ వేశారని సమాచారం.మరి స్ట్రీమింగ్‌కి ముందే ఇలా ఉంటే స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ షో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.