పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఏంటి.. షాకయ్యారా..? యస్! కరక్టేనండీ.. హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఎక్కడ.. ఏ సినిమాకు పని చేస్తున్నారని అడగాలనుకుంటున్నారా? మెగాస్టార్ సినిమాకు పనిచేస్తున్నారు. అదే ఆన్సర్.
మెగా ఎపిక్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌కు మరింత క్రేజ్ తీసుకురావడం కోసం ‘తమ్ముడు’ పవన్‌కల్యాణ్‌తో వాయిస్సోవర్ చెప్పించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు ఇతర భాషల్లో ‘సైరా’ టీజర్‌కు ఎవరి స్వరం వినిపిస్తే బావుంటుందో బాగా సెర్చ్ చేసి చివరకు మలయాళం వెర్షన్‌కు మోహన్‌లాల్‌ని తీసుకున్నారు.
సైరా చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాంచరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా, నిహారిక… ఇలా బాలీవుడ్, శాండల్‌వుడ్, కోలివుడ్ టాప్ యాక్టర్స్‌తో కూడిన భారీ తారాగణంతో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల కాబోతుంది.