పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టనున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో కలిసి ‘వినోదయ సీతం’ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. జులై 28న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
మాతృకకు దర్శకత్వం వహించినా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ యాక్టర్ సముద్రఖనినే ఈ రీమేక్ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో కేతికా శర్శ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్‌తో పాటు వివేక్ కూచిబొట్లలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తెలుగు వెర్షన్ కోసం మాటలు అందిస్తున్నారు. ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ వినోదయం సీతంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథతో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ దసరాకు విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మతగా వ్యవహరిస్తున్నారు.
దీంతో పాటే పవన్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇది ఇంకా షూటింగ్ ప్రారంభించుకోలేదు. అలాగే సాహో ఫేం దర్శకుడు సుజిత్తో ‘OG’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు.