పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలలో హీరోగా నటిస్తూ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. జనసేన పార్టీని స్థాపించి అధికార పక్షం తప్పులను ఎత్తి చూపుతున్నాడు.
అయితే పవన్ విమర్శలు చేసే అధికార పార్టీ నాయకులు పవన్ పై ప్రతి విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు చేసేదంతా కూడా మూడు పెళ్లిళ్లు గురించి మాత్రమే చేస్తూ ఉంటారు. పవన్ విడాకులు ఇచ్చిన మొదటి ఇద్దరు భార్యలు మాత్రం ఏనాడు కూడా పవన్ గురించి విమర్శలు చేయలేదు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం పవన్ మూడు పెళ్లిళ్లు పై విమర్శలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ లీగల్ గా పెళ్లిళ్లు చేసుకున్నాడని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ALSO READ : మహేష్ ఫాన్స్ ను భయపెడుతున్న జగన్
ఇక పవన్ రష్యా దేశానికి చెందిన అన్నా లెజెనోవా ను మూడవ పెళ్లి చేసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరి పెళ్లి జరిగింది. తీన్మార్ షూటింగ్ సమయంలో ఆమె పవన్ కు పరిచయమైంది. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ALSO READ : త్వరగా రమ్మని నాన్న ముందే చెప్పాడు… నిహారిక ఇష్యూపై వరుణ్ కామెంట్స్ వైరల్
ఆమెకి రష్యా సింగపూర్ లో 1800 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయట. ఈ విషయం తెలిసిన వారంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా పవన్ ను పెళ్లి చేసుకున్న తరువాత అన్నా లెజెనోవా పెద్దగా మీడియాలో ఎక్కడా కనిపించింది లేదు.