ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్రలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు రానున్నట్టు ఆయన తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదని, మరో ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలకు అందరూ రెడీగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
షిండేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఆ ప్రభుత్ం పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. మంత్రిత్వ శాఖల కేటాయింపు ముగిశాక వారిలో అసంతృప్తి బయటకు వస్తుందన్నారు.
ఫలితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. షిండే చేస్తున్న ప్రయోగాలతో తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఉద్దవ్ దగ్గరకు మళ్లీ వస్తారని ఆయన పేర్కొన్నారు.