పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు మంచి జోష్ ని అందిస్తున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభం లో సరిలేరు నీకెవ్వరు సినిమా తో మంచి సక్సెస్ ని అందుకొని ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారట. ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ కనిపోయించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు పోస్టులు పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ వార్తలు చూసిన మహేష్ ,పవన్ అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. పవన్ మహేష్ బాబు కలిసి నటించాలని ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త తో ఇన్నాళ్లకు మా కల నెరవేరబోతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో నటించిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.