ఆకర్షణీయమైన ఎత్తు, అందంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మరింత హైప్ తెచ్చుకుంది ఆ అమ్మడు. ఆ సినిమాలో నటనకు పాయల్ కు మంచి మార్కులే పడటంతో.. తరువాత వెంకీ మామ సినిమాలో నటించింది. విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. ప్రస్తుతం పాయల్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నా నరేంద్ర సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో పాయల్ నీలేశ్ జోడీగా కనిపించనుంది. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం షూటింగ్ వేగం పెంచింది.
శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఓ బాక్సర్, స్వదేశానికి ఎలా చేరుకున్నాడనే నేపథ్యంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫైటర్ పైలెట్ గా ఈ సినిమాలో పాయల్ కనిపించనుంది.ఆసక్తికర పాత్రలో పాయల్ కనిపించనుడటంతో ఈ సినిమాపై ఆమె అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఇజబెల్లె లైట్ కూడా నటిస్తోంది.