మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే సెటైరికల్ మూవీ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చెప్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో RX100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటించనుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ పాయల్ రాజ్‌పుత్, విష్ణుమంచుతో స్వాతిగా నా షూట్ ప్రారంభించడం చాలా ఉత్సాహంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది.
ఇక పాయల్ తన తొలి చిత్రం RX100తో మంచి హిట్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమాతో అయినా పాయల్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తుండగా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.