అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే కుర్రకారు లో సెగలు పుట్టించి తన వైపుకు తిప్పుకుంది. అయితే ప్రస్తుతం పాయల్ కు కూడా గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. ఇదే విషయమై పాయింట్ స్పందిస్తూ.. నా ఇమేజ్ దృష్ట్యా దర్శకనిర్మాతలు ఒకేరకమైన పాత్రలతో నా వద్దకు వస్తున్నారు.
నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ నా వద్దకు వచ్చే కథలలో నుంచి మంచి పాత్ర ని సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాను. అయితే గ్లామర్ పాత్రలు చేస్తున్నప్పటికీ నా హద్దులు మాత్రం నేను దాటను నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను. నా కెరీర్ ఇప్పుడు మొగ్గ దశలోనే ఉంది.అలా అని అందాలు చూపించడంలో హద్దులు దాటబోనని చెప్పుకొచ్చింది.