ఆర్.ఎక్స్ 100తో హిట్ కొట్టి తెలుగు కుర్రకారు దృష్టిలో పడిన హీరోయిన పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతోనే దర్శకుడు అజయ్ భూపతి సైతం హిట్ లిస్ట్ లో చేరిపోయారు. ఈ సినిమా విడుదలైనప్పటికీ రెండు సంవత్సరాల వరకు కొత్త సినిమా మొదలుపెట్టని దర్శకుడు, మహా సముద్రం అనే సినిమా తీయనున్నాడు.
మహా సముద్రంలో శర్వానంద్ ,సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అతిథిరావు హైదరీ, అను ఇమ్మానియేల్ లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. తన ఆర్.ఎక్స్ 100 సెంటిమెంట్ ని కొనసాగిస్తూ… పాయల్ కి ఓ పాత్ర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీ టాక్.
నిజానికి పాయల్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నప్పటికీ తనకు పెద్దగా క్రేజ్ లేదు. దీంతో ఐటెం సాంగ్ ను పాయల్ తో చేయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.