ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మరోవైపు యూత్ ని తన అందాల తో పాయల్ మరింత కట్టిపడేసింది. ఇక ఈ సినిమా తర్వాత పాయల్ వెంకీమామ, డిస్కో రాజా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలా ఉండగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు వేడి పుట్టించే పాయల్ తాజాగా తన లవర్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా పాయల్ ప్రేమ వ్యవహారం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రాగా ఈ పిక్ పోస్ట్ చేసి తాను ప్రేమలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ తన ప్రియుడు సౌరబ్ ఫోటోను పోస్ట్ చేసింది పాయల్.