rx100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, తన అందంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఇటీవల బాబీ దర్శకత్వంలో వెంకటేష్, చైతులు హీరోలుగా వచ్చిన సినిమా వెంకీ మామ. వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కు జోడిగా నటించిన ఈ అమ్మడు తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. వరుస హిట్ లు రావటంతో ఈ అమ్మడు ఇప్పుడు కాస్త జోరు మీద కనిపిస్తుంది. షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికినా… ఫోటో షూట్ లు చేస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ, నెట్టింట్లో నెటిజన్లకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా పాయల్ కొన్ని ఫోటోలును పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.