మొదటి అనుభవం ఫేమ్ కాశీనాథ్ మార్క్ శృంగార చిత్రాలు.. మరాఠీ యాక్టర్ దాదా కొండ్కే, భార్గవ్ ఆర్ట్స్-కోడి రామకృష్ణ తరహా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మూవీస్… మలయాళీ మసాలా మూవీస్ పాత జనరేషన్స్ పాత చింతకాయ పచ్చడి.
ఇప్పుడు పాయల్ వంటి ఒక హీరోయిన్… రెండు, మూడు హాట్ సీన్స్ వుంటే ఇనఫ్.. ఆ మూవీ గ్యారంటీ హిట్.. ఇదే నయా ట్రెండ్.
హాట్ లుక్స్ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100లో చెలరేగిపోవడంతో కుర్రకారు ఆమెకు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆర్డీఎక్స్ 100- లవ్ అనే తన కొత్త మూవీతో పాయల్ ఫాన్స్‌ను కవ్విస్తోంది.
వెండి తెర బ్లఫ్ బ్యూటీస్ ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేస్తే తప్ప ఇప్పటి యంగ్ జనరేషన్‌కి ఎక్కడం లేదట. అందుకే.. హాట్ కిస్సెస్.. శృతిమించిన రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు దాదాపు ప్రతి మూవీలోనూ ఫిక్సెడ్ ఫార్ములాగా మార్చేశారు. బాలివుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్ ఇఫ్పుడు మనదాకా వచ్చి అతుక్కుపోయింది.
ఏ ట్రెండు ఎప్పుడు ఎలా నడిస్తే ఆ ట్రెండులో అలా కొట్టుకుపోవాలని, క్యాష్ చేసుకోవాలని మూవీ మార్కెటర్స్ బాగా నమ్ముతారు. అందుకే హాట్ సీన్స్ మస్తుగా వున్న మసాలా తరహా మూవీస్ తీయడానికి చాలామంది ఫిక్సయిపోతున్నారు. ఒక్క సీన్ చాలు.. హౌస్ ఫుల్ కలెక్షన్స్.. ! బి, సి సెంటర్ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నామని టాలీవుడ్ చిత్ర ప్రొడ్యూసర్లు చెబుతుంటారు.
ఒక పక్క సాహో, సైరా, రంగస్థలం, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా వంటి క్రియేటివ్ మూవీలు వస్తున్న కాలంలో చీప్ మసాలా మూవీస్ రావడం టాలివుడ్ దురదృష్టం. ఆర్డీఎక్స్ 100- ఒక సెక్స్ బానిస స్టోరీ. సేమ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయితో అతను జోడీ కట్టడం కధలోని హాట్ మెసేజ్. దీనిలో పాయల్ హొయలు…హాట్ డ్రెస్సులు, కవ్వించే చూపులు టీజర్లో యువతను మత్తెక్కించే రీతిలో ఉన్నాయి. అన్ని షాట్లలో గ్లామర్ పేరుతో పాయల్ రాజ్ పుత్ సి గ్రేడ్ మలయాళ మూవీ స్టార్ల రేంజ్లో ఉంది.
ఇలాంటి సినిమాలతో యూత్ పెడదారి పట్టి సమాజానికి సవాల్ అయ్యే ప్రమాదం ఉంది. డబుల్ ఎక్స్ మూవీని ఆకర్షణీయ బడ్జెట్లో రూపొందించడం, యూత్ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఈ సినిమా టార్గెట్.
ఆసక్తికరమైన కథలు ఉండాలి కానీ… హీరోయిన్ స్కిన్ షో, అసభ్యమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ కొల్లగొట్టాలనుకోవడం చీప్ టెక్నిక్. హీరోయిన్ స్కిన్ షోతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి క్యాష్ చేసుకోవాలనుకోవడమే దౌర్భాగ్యం.