Rx100 సినిమాలో లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్లతో కుర్రకారుకు సెగలు పుట్టించిన హీరోయిన్ పాయల్ రాజపుత్. ఈ సినిమా హిట్ తో అమ్మడుకు మంచి అవకాశాలు వచ్చాయనే చెప్పాలి. తాజాగా ఈ అమ్మడు వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో నటించి మంచి విజయం సాధించటంతో ఓ నిర్ణయికి వచ్చిందని తెలుస్తుంది.
మొదట గ్లామర్ తో సినిమాల్లో రాణించాలని అనుకున్న పాయల్ RDX వంటి మూవీ చేసి చతికిల పడింది. ఇక నుంచి ఇలా కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు రాకపోయినా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చెయ్యాలని బావిస్తుందట పాయల్. మరి పాయల్ అంచనాలు, ఆలోచనలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తుంది. అదే కాకుండా తమిళంలో ఏంజల్ అనే సినిమాలో నటిస్తుంది.