గత వారం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.ఈ వీడియోలో బ్రా లేకుండా ఫోటోలకు పోజులిచ్చింది ఈ అమ్మడు. కాగా ఆ వీడియోపై విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఆ ట్రోల్స్ పై స్పందించారు పాయల్. ట్రోలింగ్ విషయంలో తన తల్లి ఎంతగానో భాదపడిందని… ఆ బాధ ఎంత అంటే నన్ను సినిమాలు ఆపేయాలని కోరిందని చెప్పుకోచింది. కానీ తనకు ఇష్టమైనది చేయటం కోసం గట్టిగ నిలబడ్డానని చెప్పుకోచ్చింది.
ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత డిస్కో రాజా, వెంకీ మామ సినిమాల్లో నటించింది. ఆర్ ఎక్స్100 మినహా మిగిలిన సినిమాలు ఏవి కూడా అనుకున్న స్థాయిలో పాయల్ కు పేరును తీసుకురాలేదు. ఇక ప్రస్తుతం 3 రోజెస్ వెబ్ సిరీస్ చేస్తుంది పాయల్.