పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి పేరు ఖరారైందని వార్తలొచ్చాయి. ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్, సీఎల్పీ నేతగా శ్రీధర్ బాబు పేరు ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ జీవన్ రెడ్డి ఆసక్తిగా లేకపోవటం, బీసీ నాయకుల అసంతృప్తితో ప్రకటన వాయిదా పడింది. ఈ పేర్లను ఏఐసీసీ కావాలనే లీక్ చేసి, టెస్ట్ చేసి… వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పీసీసీ చీఫ్ ఎవరు అనే ప్రకటన ఇప్పట్లో ఉండదని, బహుషా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ప్రకటన వాయిదా పడ్డట్లేనంటూ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రకటించారు. కొందరు సోనియాగాంధీకి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఒక్క ఇంచార్జ్ మాణికం ఠాగూర్ చెప్పేదే ఫైనల్ కాదంటూ కుండబద్ధలు కొట్టారు. గతంలో జానారెడ్డి బీసీ నాయకుడి చేతిలో ఓడిపోయారని, ఆయన కూడా ఇప్పుడే ప్రకటనలు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు మధుయాష్కీ దృవీకరించారు.
తాను జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసేందుకు మద్ధతిచ్చానని, అయితే… ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రకటన జరిగే అవకాశం లేదని తెలిపారు.