పొలాలలో పారాల్సిన నీరు, పేదల కన్నీటి వెంట జాలువారుతుంటే… పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే… యువరైతు రాజేష్ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్ కాదా!?
ఇప్పటికైన స్పందిస్తారా… మరో రైతు ఊపిరిపోకుండా చూస్తారా!? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో పంట మునగటంతో ప్రభుత్వం పరిహారం ఇవ్వదన్న బెంగతో అప్పుల బాధతో యువరైతు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు జెండా వాడకు చెందిన రాజేష్ బతుకమ్మ వాగు దగ్గర 6ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిపంట వేశాడు. కానీ వరదలకు పంట నీట మునిగింది. అన్నారం బ్యారేజ్ లో స్టోర్ చేసిన వాటర్ వెనుక ఉన్న పత్తి పంటలను ముంచెత్తింది. దాన్ని చెడగొట్టి మిర్చి పంట వేశాడు. కానీ మళ్లీ అదే పరిస్థితి. పైగా మూడు సంవత్సరాలుగా రాజేష్ ఇలా నష్టపోతూనే ఉన్నాడు. ఓవైపు పెరుగుతున్న అప్పులు, వడ్డీలు… మరోవైపు పరిహారం కోసం ఎదురు చూపులు. దీంతో భవిష్యత్ పై భయంతో స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పొలాలలో పారాల్సిన నీరు, పేదల కన్నీటి వెంట జాలువారుతుంటే… పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే… యువరైతు రాజేష్ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్ కాదా!? ఇప్పటికైన స్పందిస్తారా… మరో రైతు ఊపిరిపోకుండా చూస్తారా!? pic.twitter.com/3cTEqafwfc
— Revanth Reddy (@revanth_anumula) September 24, 2021
Advertisements