హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో చిన్నారి పాశవిక హత్యాచారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. సమాజమా సిగ్గు పడు అంటూ ప్రతి తండ్రి కన్నీరు పెడుతున్నారు. ఈ హత్యాచార ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్నారి జీవితాన్ని చిధిమేసిన కిరాతకుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా… ప్రభుత్వం, పోలీసులు పెదవి విప్పటం లేదు. దీంతో చిన్నారికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ మద్ధతుగా నిలబడాలని నిర్ణయించింది. బాలిక కుటుంబాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సీతక్క వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11గంటలకు రేవంత్ రెడ్డి అండ్ టీం బాధిత ఇంటికి వెళ్లనున్నారు.
ఈ ఘటనపై సీఎం తక్షణమే స్పందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు దిగుతామని హెచ్చరించింది.