పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సర్కార్ రాజద్రోహం కేసులు పెట్టబోతుందా….? కనీసం మూడు నెలల పాటు బెయిల్ రాకుండా కేసులు పెట్టబోతున్నారా…? రేవంత్ అటాక్ తో కేటీఆర్ రగిలిపోతున్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.
సీఎం కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే, మంత్రి కేటీఆర్ డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ పీసీసీ చీఫ్ కొంతకాలంగా మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఏ మాత్రం అవకాశం దొరికినా వదలటం లేదు. డ్రామారావు అంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా 6 ఏళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ఫుల్ టార్గెట్ చేశారు. ఈ విషయంలో కేసీఆర్ చాలా బద్నాం అయ్యారు కూడా.
అయితే, తాజాగా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ స్పందిస్తూ… పెయిటింగ్ వేసుకొని బతికిన వ్యక్తికి జూబ్లీహిల్స్ నాలుగు ఇండ్లు ఎలా వచ్చాయో బయటకు తీస్తామని, గుడ్డలూడదీస్తామని హెచ్చరించారు. నాకు డ్రగ్స్ కు ఏం సంబంధం…? నా రక్తం, వెంట్రుకలు ఇవ్వటానికి నేను రెడీ మీ రాహుల్ ఇస్తాడా అని కామెంట్ చేశారు. ఈడీ కి లెటర్ ఇచ్చిన వాడు బఫూన్… ఇక నుండి ఎవడైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతామన్నారు. అందరి బాగోతాలు మా దగ్గర ఉన్నాయని, అన్నీ బయటపెడతామంటూ కేటీఆర్ చిట్ చాట్ లో కామెంట్ చేశారు.