సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించాలన్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షాలను విమర్శించిన అందరి మీద ఈడీ, సీబీఐ దాడులు జరిగాయని… కానీ ఒక్క కేసీఆర్ మీద మాత్రమే ఇప్పటి వరకు ఆ సంస్థల కన్ను పడలేదన్నారు. కేసులకు భయపడే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.