జార్జిరెడ్డి సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్న లెఫ్ట్ సంఘాలు, ముఖ్యంగా జార్జిరెడ్డి స్టూడెంట్ యూనియన్ అయిన పీడీఎస్‌యూ వర్గం విశ్లేషణ చూస్తే…
తెలంగాణ చేగువేరాగా, రైటిస్ట్‌లు దేవున్ని ఎలా కొలుస్తారో… పీడీఎస్‌యూ కూడా అంతకన్నా ఎక్కువగా జార్జిరెడ్డిని ఆరాధిస్తుంది. అందుకే జార్జిరెడ్డి బయోపిక్ అంటే… సినిమా అంటే పెద్దగా పడని వారు కూడా ప్రీరీలిజ్ షోలకు క్యూ కట్టారు. కానీ సినిమా చూశాక వాళ్లంతా జార్జిరెడ్డి పేరును నాశనం చేశాడురా అంటూ పెదవి విరుస్తున్నారు. సినిమా తియ్యరాకపోతే మూసుకొని కూర్చోవాలే కానీ ఏగేసుకుంటు వచ్చి ఎందుకిలా… బద్నాం చేయటం అంటూ మండిపడుతున్నారు. ఏదో చెప్పాలన్న తాపత్రయంతో ఏమీ చెప్పలేకపోయారు అంటూ… అనుభవలేమితో కథను, జార్జిరెడ్డిని మళ్లీ చంపారు అంటూ మండిపడుతున్నారు.
ఇక మరికొందరు మాత్రం… విప్లవకారుల సినిమాలు మనసుతో చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ త్యాగాలు, ధైర్యం అక్కడ ముఖ్యం. రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, వాళ్ళ త్యాగాలను తక్కువ చూపటం మాత్రం క్షమించరాని నేరం అని స్పష్టం చేస్తున్నారు.