ఉత్తర కశ్మీర్ లోని అత్యంత చివరి గ్రామం మచిల్ సెక్టార్. ఇది కుప్వారా జిలాల్లో ఉంది. ఒకప్పడు ఈ గ్రామంలో ఎప్పుడు కాల్పుల మోతలతో దద్దరిల్లి పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి మోర్టార్ షెల్స్ దూసుకు వస్తాయో తెలియక గ్రామస్తులు ఆందోళన పడేవారు.
దాయాది దేశం కురిపిస్తున్న మోర్టార్ షెల్స్ వర్షంతో వారి ఇండ్లు ధ్వంసమయ్యేవి. రోజు వందలాది మంది గాయాల పాలైతూ ఉండేవారు. అందుకే ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటే వణికి పోయేవారు. కానీ ఇటీవల ఆ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా అక్టోబర్ 2019లో దాయాది దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఆ పరిస్తితి మారిపోయింది.
కాల్పుల్లో నా కుటుంబం మొత్తం గాయపడిందిః లతీఫ్
2019లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. మోర్టార్ షెల్స్ దాడుల్లో తమ కుటుంబం మొత్తం గాయపడిందని మహమ్మద్ లతీఫ్ అనే గ్రామస్తుడు తెలిపారు. ఆ సమయంలో మా రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. నా పెద్ద కుమారుడికి భుజానికి గాయాలయ్యాయి. నా చిన్న కుమారుడికి కాలుకు గాయాలయ్యాయి.
బ్యాంకు నుంచి గతేడాది లోన్ తీసుకుని వారికి చికిత్స చేయించాను. ఇప్పుడిప్పుడే స్కూల్ కు వాళ్లు స్కూల్ కు వెళుతున్నారు. గతేడాది భారత్- పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. దీంతో ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే మా గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని ముందు భవిష్యత్ లోనూ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము.
కాల్పుల విరమణ ఒప్పందంతో మారిన పరిస్థితి
ఇరు దేశాల మధ్య 2019 అక్టోబర్ లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక అప్పటి నుంచి గ్రామంలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలు నెమ్మది నెమ్మదిగా పొలాల బాట పడుతున్నారు. గ్రామస్తులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం ప్రారంభించారు. కొంత మంది చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధికి ఆర్మీ సహాయం
ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో భారత ఆర్మీ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ రోడ్లను నిర్మించడం, విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడం, ఇక్కడ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఆర్మీ తీవ్రంగా కృషిచేస్తోంది. స్థానికులకు సహాయం చేసేందుకు పలు ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలతో కలిపి తీసుకు వస్తోంది.