దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సారి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లలను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
జనవరి 1 నుంచి 20 వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ,వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం,కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆయా రైళ్లలో రిజర్వుడ్, అన రిజర్వుడ్ బోగీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రి సమయాల్లో కూడా ఈ రైళ్లు నడవనున్నాయి.
ఈనెల 9 న సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్, వికారాబాద్ నుంచి నరసాపూర్, సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, 12 న నరసాపూర్ నుంచి సికింద్రాబాద్, కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్ , 13 న వికారాబాద్ నుంచి కాకినాడ టౌన్, సికింద్రాబాద్ నరసాపూర్,14 న కాకినాడ నుంచి సికింద్రాబాద్,నరసాపూర్ నుంచి సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, 16 న సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్ 17న కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్,వికారాబాద్ నుంచి కాకినాడ టౌన్ 18న కాకినాడ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ఈ రైళ్లకు ఈ నెల 31 వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభం కానుంది. వీటికి నడికుడి, సత్తెనపల్లిలో హోల్డింగ్ ఉంటుంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకుంటే టీసీఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ యాప్ లేదా వైబ్ సైట్ లో రిజర్వుడ్ టిక్కెట్లను బుకింగ్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.