భూమి మీద ఉన్న అన్ని జీవులకు భిన్నంగా దేవుడు మనిషికి ఆలోచనను అదనంగా ఇచ్చాడని చెబుతారు. కానీ, కొన్ని సంఘటనలు చూస్తే.. ఇది తప్పు అనిపిస్తుంది. మనుషులు వలే మిగిలిన జంతవులు, పక్షులకు కూడా ఆలోచనలు, ప్రేమలు, ఆప్యాయతలు ఉంటాయని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ మధ్య మహారాష్ట్రలో ఒక కోతిని కొన్ని కుక్కలు చంపేశాయనే ప్రతీకారంతో.. కోతులు పక్కాగా ప్లాన్ చేసి 250 కుక్క పిల్లలను చంపేసిన విషయం తెలిసిందే. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఆలోచన, ఆప్యాయతలు లేకుండా కోతులు ఈ పని చేస్తాయా?
తాజాగా మరో ఘటన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. చనిపోయిన ఒక నెమలిని ఇద్దరు వ్యక్తులు తీసుకొని పోతుంటే.. దాని వెనక మరో నెమలి నడుచుకుంటూ పోతుంది. ఆ వీడియోను చూసిన ఎవరైనా ఇతర జీవుల్లో కూడా బాధ, ప్రేమలు ఉంటాయని ఒప్పుకుంటారు. రాజస్థాన్ కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. చనిపోయిన ఓ నెమలి మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు తీసుకొని వెళ్తుంటే.. వారి వెనక దీనంగా నడుచుకుంటూ వెళ్తున్న మరో నెమలిని మనం ఆ వీడియోలో గమనించవచ్చు. రాజస్థాన్‌లోని కుచేరాలో శ్రీ రామస్వరూప్ బిష్ణోయ్ ఇంటికి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పర్వీన్ అన్నారు. గత నాలుగేళ్లుగా ఈ రెండు నెమళ్లు సహజీవనం చేసుకుంటున్నాయని తెలిపారు. చివరికి చనిపోయిన నెమలి అంత్యక్రియల్లో కూడా రెండో నెమలి పాల్గొందని ట్విట్టర్ ద్వారా పర్వీక్ చెప్పారు.
The incident is from house of Shri Ramswarup Bishnoi. From Kuchera, Rajasthan.
The peacock were living together from four years. After death of one, another participated in funeral. When they made this video.https://t.co/J6res1ckqk
— Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022